వరంగల్: పట్టలేని కోపంతో ఓ వ్యక్తి తల్లీ కూతుళ్లపై కిరోసిన్ పోసి నిప్పంటించిన సంఘటన వరంగల్ జిల్లాలో జరిగింది. ఏటూరునాగారం గ్రామానికి చెందిన సమ్మక్క అనే ఆమెకు ఇద్దరు పిల్లలు. భర్త ఏడాదిక్రితం మరణించాడు. అనంతరం ఆమె అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది.
ఇటీవల ఇద్దరికీ గొడవలు జరగటంతో సమ్మక్క అతనితో మాట్లాడటం మానేసింది. ఇంటికి వస్తే మందలించింది. దాంతో అతను కక్ష పెంచుకుని అర్థరాత్రి వచ్చి తలుపులు కొట్టగా ఆమె తీయలేదు. దీంతో ఆగ్రహించిన అతడు గుడిసెపై రంధ్రం చేసి కిరోసిన్ చల్లి నిప్పంటించాడు. దీంతో తల్లి, చిన్నకూతురు సజీవదహనం అయ్యారు. మంచం కూడా కాలిపోయింది. పెద్దకూతురు వెంటనే బట్టలు తీసి విసిరేయటంతో బతికిబయటపడింది.